శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Aug 04, 2020 , 21:57:34

విరించి ఆస్పత్రికి కోవిడ్‌ చికిత్స అనుమతి రద్దు

విరించి ఆస్పత్రికి కోవిడ్‌ చికిత్స అనుమతి రద్దు

హైదరాబాద్‌ : నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబరు. 1లో గల విరించి ఆస్పత్రికి ఇచ్చిన కోవిడ్‌ చికిత్స అనుమతిని ప్రభుత్వం రద్దు చేసింది. కోవిడ్‌ చికిత్సకు అధిక బిల్లులు వసూళ్లు చేసినట్లుగా తేలడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కొత్తగా కోవిడ్‌ రోగులను చేర్చుకోవడానికి వీల్లేదని ఆదేశాలు జారీచేసింది. ప్రస్తుతం ఉన్న రోగులకు యథావిథిగా ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం చికిత్స కొనసాగించాలని ఆదేశించింది. ఆదేశాలు మీరి ప్రవర్తిస్తే అసలు ఆస్పత్రి పర్మిషన్‌నే రద్దు చేస్తామని హెచ్చరించింది. అధిక బిల్లులు వేశారని నిన్న డెక్కన్‌ ఆస్పత్రిలో కోవిడ్‌ చికిత్స అనుమతిని ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.


logo