గురువారం 04 మార్చి 2021
Telangana - Jan 15, 2021 , 20:20:13

‘కొవిడ్ వ్యాక్సినేషన్‌ను పక్కాగా చేపట్టాలి’

‘కొవిడ్ వ్యాక్సినేషన్‌ను పక్కాగా చేపట్టాలి’

సూర్యాపేట : కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జిల్లాలో పగడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య అధికారులు, జిల్లా అధికారులతో నిర్వహించిన కొవిడ్ టీకా సన్నాహక సమావేశంలో పాల్గొని ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి తో కలసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిల్లాలో రేపు (16న) వ్యాక్సినేషన్(టీకా) మొదటి విడత కార్యక్రమం ప్రారంభిస్తామన్నారు.

మొదట గుర్తించిన వారికి ప్రాధాన్యత క్రమంలో టీకా అందించాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించారు. తొలిదశలో టీకా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య సిబ్బంది అలాగే అంగన్‌వాడీ సిబ్బందికి ఇస్తామన్నారు. ముందువరుసలో ఉంది వైరస్ వ్యాప్తి నిరోధానికి తోడ్పాటు అందించిన మున్సిపల్  శానిటేషన్ సిబ్బంది, పోలీస్, రెవెన్యూ మొదలైన వారికి అలాగే 50 సంవత్సరాలు పైబడిన వారికి, 50 సంవత్సరాలు లోపు ఉండి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి టీకా అంస్తామన్నారు.

 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ మాస్క్ ధరించి, భౌతిక దూరం అలాగే చేతుల పరిశుభ్రత పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు భాగస్వామ్యం అయ్యి విజయవంతం చేయాలన్నారు . టీకా వంద శాతం సురక్షిత మైనదని టీకా వేసుకున్న తర్వాత ఏమైనా  ఇబ్బందులు, జ్వరం, దద్దుర్లు  లాంటివి వస్తే  వెంటనే వైద్యం అందించేందుకు వైద్య నిపుణులు, సిబ్బంది  సిద్ధంగా ఉంటారని అన్నారు. కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

పల్లెకు పుట్టినరోజు..పరవశంలో గ్రామస్తులు

‘అక్షరయాన్’ వెబ్‌సైట్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

వన్యప్రాణి వధ.. ఇద్దరిపై కేసు నమోదు

క‌వ్వాల్ అభ‌యార‌ణ్యంలో మంత్రి అల్లోల‌ 

మంటల్లో పడి వృద్ధురాలి సజీవదహనం 

VIDEOS

logo