గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 12, 2020 , 01:10:25

డిసెంబర్‌లోగా కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వేలైన్‌

డిసెంబర్‌లోగా కొత్తగూడెం-సత్తుపల్లి రైల్వేలైన్‌
  • రెండో విడుతగా వాటాలో రూ.200 కోట్లు ఇచ్చిన సింగరేణి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ : కొత్తగూడెం - సత్తుపల్లి మధ్య రైల్వేలైన్‌ నిర్మాణానికి సింగరేణి తనవంతుగా మరో రూ.200 కోట్లను అందజేసింది. సికింద్రాబాద్‌లోని రైల్‌ నిలయం లో బుధవారం రైల్వే జీఎం గజానన్‌మాల్యను కలిసిన సింగరేణి సీఎండీ ఎన్‌ శ్రీధర్‌ చెక్కును అందజేశారు. సత్తుపల్లిలో కొత్త ఓసీ గనులు ప్రారంభమైన నేపథ్యంలో రైల్వేమార్గం పనులను త్వరగా పూర్తిచేయాలని సీఎండీ శ్రీధర్‌  కోరారు. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి రైల్వేలైన్‌ పూర్తిచేయగలమని రైల్వే అధికారులు వివరించారు. రూ.927 కోట్లతో ఈ మార్గం నిర్మించాలని నిర్ణయించగా, సింగరేణి రూ. 618.55 కోట్లు, దక్షిణ మధ్య రైల్వే రూ.309 కోట్లు భరించాలని ఒప్పందం జరిగింది. సింగరేణి తాజాగా ఇచ్చిన రూ.200 కోట్లు కలుపుకొని మొత్తం రూ.356 కోట్లను చెల్లించింది. ఈ కార్యక్రమంలో సింగరేణి ఈడీ జే ఆల్విన్‌, డీజీఎం మారెపల్లి వెంకటేశ్వర్లు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. logo
>>>>>>