శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 17, 2020 , 02:33:09

వందల గురుకులాలు మంత్రి కొప్పుల ఈశ్వర్‌

వందల గురుకులాలు మంత్రి కొప్పుల ఈశ్వర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విద్యా వ్యవస్థను గాడిలో పెట్టడంకోసం సీఎం కేసీఆర్‌ వందల సంఖ్యలో కొత్త గురుకుల విద్యాలయాలను ఏర్పాటుచేశారని ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ చెప్పారు. శాసనమండలిలో బుధవారం ఆయన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ.. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మొత్తం 970 గురుకులాలు ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నాయని చెప్పారు. వీటిలో పేద విద్యార్థులకు రూపాయి కూడా భారం పడకుండా 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఉచిత విద్య అందిస్తున్నామన్నారు. 2020-21 విద్యా సంవత్సరంలో 71 మైనారిటీ పాఠశాలలను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని వెల్లడించారు. ఈ కాలేజీల్లో 568 మంది జూనియర్‌ లెక్చరర్లు పనిచేస్తున్నారని తెలిపారు. మైనారిటీ విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాలలను ప్రారంభించే ప్రతిపాదన ఇప్పటివరకు ఏదీలేదని, భవిష్యత్తులో ఆలోచన చేస్తామని చెప్పారు. 


logo