గురువారం 04 జూన్ 2020
Telangana - May 10, 2020 , 01:03:24

తెలంగాణ రోల్‌ మోడల్‌

తెలంగాణ రోల్‌ మోడల్‌

  • ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

ధర్మపురి, నమస్తేతెలంగాణ: సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో తెలంగాణ దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మండలంలోని వెల్గటూర్‌, స్తంభంపల్లి గ్రామాల శివార్లలో గోదావరి ఒడ్డున, ఎల్లంపల్లి బ్యాక్‌వాటర్‌ ఆధారంగా రూ.59 కోట్లతో నిర్మించే ఎత్తిపోతల పథకాలను శనివారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. ఈ పథకాల ద్వారా దాదాపు 6 వేల ఎకరాలకు సాగు నీరందుతుందని చెప్పారు. వెల్గటూర్‌, స్తంభంపల్లి పనులు రెండు నెలల్లో పూర్తయ్యేలా చూడాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.


logo