Telangana
- Jan 28, 2021 , 08:10:39
VIDEOS
‘ఎంజీఎంలో’ కొండెంగ.. కోతుల బెడద తప్పిందంటున్న సిబ్బంది

దవాఖాన క్యాజువాలిటీ విభాగంలో కాపలా
వరంగల్ చౌరస్తా : సాధారణంగా గ్రామాల్లో కోతుల బెడదను తప్పించుకునేందుకు కొండెంగలను తీసుకొస్తారు. పంట పొల్లాలో కాపలా ఉంచుతారు.. కానీ వరంగల్ ఎంజీఎం దవాఖాన క్యాజువాలిటీ విభాగానికి ఎక్కడి నుంచో వచ్చిన లంగూరు జాతి కోతి కాపలా కాస్తోంది. పదిహేను రోజులుగా ఇక్కడే సంచరిస్తున్నది. కొండెంగ వచ్చినప్పటి నుంచి వానరాల బెడద పూర్తిగా తప్పిందని సెక్యూరిటీ సిబ్బంది అంటున్నారు. శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బంది దానికి ఆహారాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉండగా, కొండెంగ గర్భం దాల్చి ఉండవచ్చని, ప్రసవం తర్వాత తన పిల్లల సంరక్షణ విష యమై రోగుల మీద దాడికి పాల్పడే అవకా శాలు ఉన్నట్లు స్థానికు లు భావిస్తున్నారు. అటవీ శాఖ అధికారు లు స్పందించి దాని రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING