గురువారం 29 అక్టోబర్ 2020
Telangana - Sep 21, 2020 , 11:34:53

పేదింటి ఆడబిడ్డలకు కొండంత అండ సీఎం కేసీఆర్

పేదింటి ఆడబిడ్డలకు కొండంత అండ సీఎం కేసీఆర్

వరంగల్ రూరల్ : పేదింటి ఆడ బిడ్డల పెండ్లికి పెద్దన్నగా మారి సీఎం కేసీఅర్ కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులు అందిస్తూ కొండంత అండగా నిలుస్తున్నాడని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. రాయపర్తి మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయంలో 126 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు.పేదింటి ఆడబిడ్డల పెండ్లిండ్లకు కట్నంగా కల్యాణలక్ష్మి, షాదీ ముబార్  చెక్కులు అందించి పేదల కష్టాల్లో పాలుపంచుకుంటున్నారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ నూతన ఆలోచనలతో రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.logo