ఆదివారం 24 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 08:16:18

కొండ గొర్రెను ఎప్పుడైనా చూశారా?

కొండ గొర్రెను ఎప్పుడైనా చూశారా?

గూడూరు(మ‌హ‌బూబాబాద్‌) : గొర్రెల మందలో చేరిన ఓ కొండ గొర్రెను వరంగల్‌ వనవిజ్ఞాన్‌ కేంద్రానికి తరలించారు. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు చంద్రుగూడేనికి చెందిన దోమ సారయ్య గొర్రెలను కాసేందుకు గ్రామ సమీపంలోని చంద్రునిచెరువు ప్రాంతానికి వెళ్లాడు. అక్కడ ఓ కొండగొర్రె పిల్లను కుక్క వెంబడించడంతో అది గొర్రెల మందలో కలిసింది. ఇది గమనించిన సారయ్య.. జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ ఖాసీం సాయంతో కొండగొర్రెను బుధవారం స్థానిక అటవీశాఖ కార్యాలయంలో ఎఫ్‌ఆర్వో అమృతకు అప్పగించారు. అధికారులు దాన్ని వనవిజ్ఞాన్‌ కేంద్రానికి తరలించారు.


logo