పెద్దపల్లి : జిల్లాలోని రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న అంతర్గాం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏడో విడత హరితహారంలో భాగంగా పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. హరితహారాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన వెంట రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, సీపీ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎలుకలు 12 బాటిళ్ల మద్యం తాగేశాయ్!
పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు
దళిత వాడలో పల్లె నిద్ర చేసిన ఎమ్మెల్యే ఆనంద్
ఒలింపిక్స్‌కు భారీ టీమ్‌ను పంపనున్న చైనా