మంగళవారం 07 జూలై 2020
Telangana - Jan 27, 2020 , 01:30:07

కొడంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రిమాండ్‌

కొడంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ రిమాండ్‌
  • ఉద్యోగాలు, తక్కువ ధరకు భూములుఇప్పిస్తామంటూ డబ్బులు వసూలు

గద్వాల అర్బన్‌/కొడంగల్‌, నమస్తేతెలంగాణ: ప్రభుత్వఉద్యోగాలు, తక్కువ ధరకు భూములిస్తామంటూ మోసగించిన ముగ్గురు ప్రభుత్వఅధికారులను పోలీసులు ఆదివారం అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. కొడంగల్‌ మున్సిపల్‌ ఇంచార్జి కమిషనర్‌గా పనిచేస్తున్న మోహన్‌లాల్‌, గద్వాల జిల్లా గట్టు ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్‌ రఘునందన్‌రావు, ఆత్మకూర్‌ మున్సిపల్‌ కార్యాలయ బిల్‌కలెక్టర్‌ విజయ్‌కుమార్‌ ముఠాగా ఏర్పడి తక్కువధరకు భూములు ఇస్తామని, ఉద్యోగాలు ఇస్తామని పలువురిని మోసగించారు. మోసపోయామని గుర్తించిన బాధితులు.. గద్వాల పోలీసులను ఆశ్రయించారు. కేసునమోదు చేసిన దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. మోహన్‌లాల్‌, రఘునందన్‌రావు, విజయ్‌కుమార్‌లను అరెస్ట్‌ చేశారు. వీరికి సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్ట్‌చేశారు.


logo