Telangana
- Dec 01, 2020 , 21:14:16
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్

వరంగల్ చౌరస్తా : కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొదటి విడుత వెబ్ కౌన్సిలింగ్ డిసెంబర్ 2 నుంచి 4వ తేదీ వరకు నిర్వహించనున్నారు. 2వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 4వ తేదీ రాత్రి 7 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్ నమోదు చేసుకోవాలని అన్నారు.
యూనివర్సిటీ వెబ్సైట్లో పొందుపరచిన తుది మెరిట్ జాబితాలోని అభ్యర్థులు మొదటి విడుత వెబ్ కౌన్సిలింగ్‌కు అర్హులని తెలిపారు. వారందరూ ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్ ఇవ్వాలని అన్నారు. కళాశాలల వారీగా ఖాళీలను వెబ్సైట్లో పొందుపరిచామని తెలిపారు. మరింత సమాచారం కోసం వెబ్సైట్ www.knruhs.telangana.gov.in ను పరిశీలించవచ్చునని యూనివర్సిటీ అధికార వర్గాలు తెలిపాయి.
తాజావార్తలు
- నేడు ఐపీవోకు ఐఆర్ఎఫ్సీ: లక్ష్యం రూ.4,633 కోట్ల సేకరణ
- గోస్వామికి బాలాకోట్ దాడి ముందే తెలుసా?!
- హిందూ మనోభావాలు దెబ్బతీసేలా తాండవ్?!
- ఆదాతో ఆర్థిక కష్టాలకు చెక్: బీ అలర్ట్.. కరోనా ఎఫెక్ట్
- మాస్క్.. మట్టిలో కలిసేందుకు 50 ఏండ్లు
- ఎస్వీబీసీకి రూ.1.11 కోట్ల విరాళం
- రేపు అంగన్వాడీ సిబ్బందికి చీరెలు పంపిణీ
- జూబ్లీహిల్స్‌లో గ్యాంగ్‌వార్ కలకలం
- రామ్ చరణ్ ఖాతాలో మరో ఇద్దరు దర్శకులు.. నెక్ట్స్ ఏంటి..?
- బెంగాల్ బరిలో శివసేన.. 100 స్థానాల్లో పోటీ?!
MOST READ
TRENDING