బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 22, 2021 , 21:40:07

కన్వీనర్‌ కోటాలో ఆయుష్‌ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

కన్వీనర్‌ కోటాలో ఆయుష్‌ పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్‌

వరంగల్‌ చౌరస్తా: కన్వీనర్‌ కోటలో రాష్ట్రంలోని ఆయుష్‌ పీజీ వైద్య సీట్ల భర్తీకి కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిదాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏఐఏపీజీఈటీ-2020 పరీక్షలో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా పీజీ ఆయుర్వేదం, హోమియో, యునాని కోర్సుల్లో కన్వీనర్‌ కోటా సీట్ల భర్తీ చేపట్టనున్నట్లు తెలిపారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఈ నెల 23వ తేదీ నుంచి 28వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నామని తెలిపారు. మరింత సమాచారం కోసం యూనివర్సిటీ వెబ్‌సైట్‌ www.knruhs.telangana.gov.in లో పరిశీలించవచ్చునని పేర్కొన్నారు. 

VIDEOS

logo