సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 10, 2020 , 08:03:41

సిగరేట్‌ తాగొద్దన్నా వినలేదని కత్తిపోటు...

సిగరేట్‌ తాగొద్దన్నా వినలేదని కత్తిపోటు...

హైదరాబాద్‌: నగరంలోని పాతబస్తీ చౌక్‌కబరా వద్ద దారుణ సంఘటన చోటు చేసుకుంది. సిగరేట్‌ తాగవద్దని అభ్యంతరం తెలిపితే ఘర్షణ పడినందుకు పవన్‌ అనే వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యాడు. సంఘటన వివరాల్లోకి వెళితే... పవన్‌ తన కారు రోడ్డు పక్కన నిలిపి సిగరేట్‌ తాగుతుండగా అమీర్‌హుస్సేన్‌ అనే వ్యక్తి అభ్యంతరం తెలిపాడు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆవేశానికి గురైన అమీర్‌హుస్సేన్‌ పవన్‌ను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన పవన్‌ను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 


logo