బుధవారం 03 జూన్ 2020
Telangana - May 02, 2020 , 18:33:11

కాలువలకు నీటిని విడుదల చేసిన మంత్రి హరీశ్‌ రావు

  కాలువలకు నీటిని విడుదల చేసిన మంత్రి హరీశ్‌ రావు

సిద్ధిపేట:  చిన్నకోడూర్ మండలం చందలాపూర్ గ్రామంలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు   ప్రధాన కుడి, ఎడమ కాలువలకు నీటి  విడుదలకు మంత్రి హరీశ్‌ రావు ప్రత్యేక పూజలు చేసి నీళ్లు వదిలారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట అర్బన్ మండలం మందపల్లి గ్రామ శివారులో కుడి కాలువ గేట్ ఎత్తి మంత్రి కాలువ నీళ్లను వదిలారు.   ఈ పైపులైన్ ద్వారా నంగునూరు మండలం రాజగోపాల్ పేట, పాలమాకుల గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండుతాయని మంత్రి చెప్పారు.  

అనంతరం మిట్టపల్లి గ్రామ శివారులోని మరో పైపులైన్ తిప్పి కాలువ నీటిని వదిలారు. ఈ పైపులైన్ ద్వారా మందపల్లి చెరువులు, కుంటలు నింపుతూనే సిద్ధిపేట వాగుపై ఉన్న, 28 చెక్ డ్యామ్‌లు, 11 గ్రామాల్లో చెరువులు, కుంటలు నింపడంతో పాటుగా కోహెడ మండలం శనిగరం గ్రామ చెరువును నింపుతామని మంత్రి హరీశ్‌ రావు పేర్కొన్నారు. 
logo