శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Aug 02, 2020 , 01:51:20

రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీ సభ్యుడిగా కేకే

రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీ సభ్యుడిగా కేకే

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీ సభ్యుడిగా టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు నిర్ణయాన్ని రాజ్యసభ సెక్రటేరియట్‌ శనివారం ప్రకటించింది. రాజ్యసభ ఎథిక్స్‌ కమిటీని ఇటీవలే పునర్వ్యవస్థీకరించారు. కమిటీ చైర్మన్‌గా శివప్రతాప్‌ శుక్లా నియమితులవగా, మరో 10 మందిని సభ్యులుగా నియమించారు. ఇందులో కే కేశవరావు, ఏపీ నుంచి వీ విజయసాయిరెడ్డి సహా మరో 8 మంది సభ్యులుగా నియమితులయ్యారు.


logo