బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 03:28:10

మహిళలు.. కార్యసాధకులు

మహిళలు.. కార్యసాధకులు
  • అత్యున్నత స్థానం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  • అత్యున్నత స్థానం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
  • రాష్ట్ర మంత్రి సత్యవతిరాథోడ్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: శ్రమించేతత్వం ఉన్న మహిళలు ఏ రంగంలోనైనా కార్యసాధకులు కాగలరని రాష్ట్ర స్త్రీ, శిశుసంక్షేమ, గిరిజనశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. మహిళలు పురుషులతో సమానమ ని, ఏ రంగంలోనైనా దూసుకుపోగలరని చె ప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లోని ర వీంద్రభారతిలో వివిధ రంగాలకు చెందిన 30 మంది మహిళలను సన్మానించారు. ఈసం దర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రాష్ట్రంలో మ హిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారని చెప్పారు. బాలికలు, యువతుల విద్య, వైద్యం, ఆరో గ్యం కోసం పాటుపడుతున్నారని తెలిపారు. భారత సంస్కృతిలో, జీవనవిధానంలో మహిళలకు అత్యున్నతస్థానం ఉన్నదని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. స్త్రీలు గౌరవంపొందేచోట దేవతలుంటారని పెద్దలు చెప్పేవారని అన్నారు. ఈ విషయంలో భారత్‌ ప్రపంచానికి ఆదర్శంగా ఉన్నదని చెప్పారు. తెలంగాణలో షీటీమ్స్‌ అద్భుతంగా పనిచేస్తున్నాయని కిషన్‌రెడ్డి ప్రశంసించారు.


మహిళలకు పెద్దన్నగా కేసీఆర్‌: శ్రీనివాస్‌ గౌడ్‌

ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మహిళలు, యువతుల పట్ల పెద్దన్నగా వ్యవహరిస్తూ.. అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం మహిళా దినోత్సవం సందర్భంగా అవార్డులు, పురస్కారాలు ఇచ్చిన దాఖలా లేదన్నారు. 

 

మహిళల అభివృద్ధికి వందల కోట్లు :  తలసాని

స్త్రీ, శిశు సంక్షేమ విభాగానికి వందల కోట్ల నిధులు కేటాయించి, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఘనత కేసీఆర్‌ ప్రభుత్వానిదని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ చెప్పారు. అంగన్‌వాడీలకు పదివేల జీతం ఒకేసారి పెంచి, వారి కండ్లల్లో సంతోషాన్ని నింపారన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమశాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌, భా షా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తదితరులు  పాల్గొన్నారు. logo
>>>>>>