శనివారం 30 మే 2020
Telangana - May 13, 2020 , 15:47:19

తెలంగాణ ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌ పారిశ్రామికవేత్తలతో కిషన్‌రెడ్డి భేటీ

తెలంగాణ ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌ పారిశ్రామికవేత్తలతో కిషన్‌రెడ్డి భేటీ

ఢిల్లీ : తెలంగాణకు చెందిన చిన్న, సూక్ష్మ, మధ్యతరహా(ఎంఎస్‌ఎంఈ) పారిశ్రామికవేత్తలతో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌ రెడ్డి నేడు సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మంత్రి ఈ భేటీని నిర్వహించారు. లాక్‌డౌన్‌ కారణంగా నెలకొన్న వారి ఆందోళనలను గుర్తించినట్లు మంత్రి తెలిపారు. ఎంఎస్‌ఎంఈ రంగానికి తమ మద్దతు కొనసాగనున్నట్లు చెప్పారు. ఈ రంగాన్ని పునరుజ్జీవింపజేసేందుకు నిరంతర మద్దతు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.logo