సోమవారం 03 ఆగస్టు 2020
Telangana - Jul 14, 2020 , 15:02:36

మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ విజ్ఞ‌ప్తికి కిర‌ణ్ రిజిజు సానుకూల స్పంద‌న‌

మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ విజ్ఞ‌ప్తికి కిర‌ణ్ రిజిజు సానుకూల స్పంద‌న‌

హైద‌రాబాద్ : కేంద్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాష్ట్రాల క్రీడా, యువజన సర్వీసుల శాఖల మంత్రులతో నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసులశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయం నుండి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు క్రీడల అభివృద్ధి, మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామ‌న్నారు. 

రాష్ట్రంలో క్రీడాకారులకు 2 శాతం ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లు కల్పించటంతో పాటు ఉన్నత విద్యాభ్యాసంలో క్రీడాకారుల కొసం 0.5 శాతం రిజర్వేషన్లు కల్పించి ప్రోత్సహిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 250 ఎకరాలు విస్తీర్ణంలో క్రీడా పాఠశాల ఉందన్నారు. క్రీడా పాఠశాలలో మౌళిక వసతులను కల్పించి క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామన్నారు. ఈ నేప‌థ్యంలో కేంద్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ నుండి రాష్ట్రానికి రావాల్సిన నిధులను కేటాయించాల్సిదిగా కోరారు. మంత్రి విజ్ఞ‌ప్తిపై కిర‌ణ్ రిజిజు సానుకూలంగా స్పందించారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రాష్ట్ర యువజన సర్వీసులశాఖ ముఖ్య కార్యదర్శి సభ్యసాచి ఘోష్, క్రీడా, టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, సంయుక్త కార్యదర్శి కె. రమేష్, ఎన్‌వైకేఎస్ డైరెక్టర్ అన్షుమన్ ప్రసాద్ దాస్, సెట్విన్ ఎండీ వేణు గోపాల్, క్రీడా, యువజన శాఖ ఉన్నతాధికారులు  సుజాత, విమాలాకర్, ధనలక్ష్మి, చంద్రారెడ్డి పాల్గొన్నారు.



logo