గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 23, 2020 , 13:14:33

కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

కిన్నెరసాని ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

భ‌ధ్రాద్రి కొత్త‌గూడెం : జిల్లాలోని కిన్నెర‌సాని ప్రాజెక్టు జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకుంది. ప్రాజెక్టు రెండు గేట్ల‌ను ఎత్తి అధికారులు 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువ‌కు వ‌దులుతున్నారు. నీటి విడుద‌ల జ‌రుగుతున్న నేప‌థ్యంలో దిగువప్రాంత ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిందిగా ఇప్ప‌టికే అధికారులు హెచ్చ‌రిక‌లు జారీచేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 8.4 టీఎంసీలు కాగా ప్ర‌స్తుత నీటినిల్వ‌ 8. టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 407 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 405 అడుగులుగా ఉంది. ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 7 వేల క్యూసెక్కులు కొన‌సాగుతుంది. 


logo