ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Oct 19, 2020 , 21:01:08

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కింజారపు అచ్చెన్నాయుడు నియమితులయ్యారు. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సోమవారం కమిటీలను ప్రకటించారు. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు స్థానంలో అచ్చెన్నాయుడు నూతనంగా నియమితులయ్యారు. ఇక తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఎల్ రమణను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మరోసారి నారా లోకేష్‌ నియమితులయ్యారు. 

27 మంది సభ్యులతో ఆ పార్టీ కేంద్ర కమిటీని, మరో 25 మందితో పొలిట్‌ బ్యూరోను ఏర్పాటు చేశారు. 31 మందితో టీటీడీపీ రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేయగా టీటీడీపీ సమన్వయ కమిటీ సభ్యులుగా ఆరుగురిని నియమించారు. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు కొనసాగనుండగా.. ఆరుగురిని ఉపాధ్యక్షులుగా నియమించారు. పార్టీ సీనియర్‌ నేతలు కావలి ప్రతిభా భారతి, గల్లా అరుణ కుమారి, డీకే సత్యప్రభతోపాటు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి, నాగేశ్వరరావు, కాశీనాథ్‌కు అవకాశం కల్పించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.