శనివారం 28 మార్చి 2020
Telangana - Mar 15, 2020 , 00:46:39

గ్రీన్‌చాలెంజ్‌లో కిమ్స్‌ చైర్మన్‌

గ్రీన్‌చాలెంజ్‌లో కిమ్స్‌ చైర్మన్‌
  • ప్రకృతితో మమేకమవుదామని పిలుపు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/బేగంపేట: గ్రీన్‌చాలెంజ్‌లో భాగంగా కిమ్స్‌ దవాఖాన చైర్మన్‌ భాస్కర్‌రావు మొక్కలునాటారు. సన్‌షైన్‌ దవాఖాన చైర్మన్‌ గురువారెడ్డి విసిరిన గ్రీన్‌చాలెంజ్‌ స్వీకరించిన ఆయన స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకుడు కట్టెల శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి సికింద్రాబాద్‌లోని దవాఖాన ఆవరణలో శనివారం మూడు మొక్కలునాటారు. అనంతరం బీఎస్సీపీఎల్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శీనయ్య, ఆదాయ పన్నుశాఖ మాజీ కమిషనర్‌ రాజేశ్వరరావు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి హరిత సవాల్‌ విసిరారు. ఈ సందర్భంగా భాస్కర్‌రావు మాట్లాడుతూ.. మనిషి ప్రకృతితో మమేకం కావాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమంలా కొనసాగుతున్న గ్రీన్‌చాలెంజ్‌లో పాల్గొనడం తనకు ఎంతో సంతోషంగా ఉన్నదన్నారు. సామాజికసేవలో భాగంగా మొక్కల పెంపకం, పార్కుల అభివృద్ధికి ‘సీఎస్సార్‌' కింద డబ్బు కేటాయిస్తానని చెప్పారు.


logo