బుధవారం 23 సెప్టెంబర్ 2020
Telangana - Sep 12, 2020 , 03:44:01

ఖజానా జువెలర్స్‌ భారీ వితరణ

ఖజానా జువెలర్స్‌ భారీ వితరణ

  • కొవిడ్‌ నియంత్రణకు రూ.3 కోట్ల విరాళం
  • ఎర్రబెల్లి చొరవతో మంత్రి కేటీఆర్‌కు అందజేత

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవడానికి ఖజానా జువెలర్స్‌ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.3 కోట్ల విరాళం అందజేసింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చొరవతో ఖజానా జువెలర్స్‌ అధినేత కిశోర్‌కుమార్‌ ఈ విరాళాన్ని శుక్రవారం హైదరాబాద్‌లో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌కు అందజేశారు. ఈ నిధిని కరోనా నిర్మూలన, బాధితుల సంరక్షణలో భాగంగా వరంగల్‌ ఎంజీఎం దవాఖానకు వినియోగించాలని అభ్యర్థించారు. ఖజానా జువెలర్స్‌ ఔదార్యాన్ని మంత్రి కేటీఆర్‌ అభినందించారు. సేవాదృక్పథం, సామాజిక బాధ్యతతో విరాళం ఇవ్వడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తన చిరకాల మిత్రుడైన కిశోర్‌కుమార్‌ ఇలాంటి సహాయాలు చేస్తుంటారని, ఈసారి కరోనా బాధితుల కోసం ముందుకు రావడం ఆనందంగా ఉన్నదని అన్నారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌, మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు శంకర్‌నాయక్‌, చల్లా ధర్మారెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త గౌతంజైన్‌ పాల్గొన్నారు. 


logo