శుక్రవారం 23 అక్టోబర్ 2020
Telangana - Oct 07, 2020 , 01:33:44

ఆస్తుల నమోదులో ఖమ్మం టాప్‌

ఆస్తుల నమోదులో ఖమ్మం టాప్‌

  • మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

ఖమ్మం ప్రతినిధి, నమస్తే తెలంగాణ: వ్యవసాయేతర ఆస్తుల గణన, ఆన్‌లైన్‌ నమోదులో ఉమ్మడి ఖమ్మం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ పై మంగళవారం ఖమ్మంలో రెండు జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహించిన సమావేశం లో ఆయన మాట్లాడారు. వివరాల నమోదులో ఖమ్మం జిల్లా మొదటి స్థానంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 3వ స్థానంలో ఉన్నదన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, లావుడ్యా రాములునాయక్‌, సండ్ర వెంకటవీరయ్య, వనమా వెంకటేశ్వరరావు, హరిప్రియా, మెచ్చా నాగేశ్వరరావు, ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్లు ఆర్వీ కర్ణన్‌, ఎమ్వీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


logo