గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - May 27, 2020 , 21:34:56

ఖమ్మంలో మాస్క్‌ల ఔట్‌లెట్‌ ప్రారంభం

ఖమ్మంలో మాస్క్‌ల ఔట్‌లెట్‌ ప్రారంభం

ఖమ్మం: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మాస్క్‌ల వాడకం తప్పనిసరైంది. పలు మహిళా సంఘాలు, చేనేత సహకార సంఘాలు మాస్క్‌లను తయారుచేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నారు. పలు స్వచ్చంధ సంస్థలు వలస కార్మికులు, రైతులకు ఉచితంగా మాస్క్‌లను పంచిపెట్టాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మాస్క్‌లు మనలో భాగంగా మారిపోయాయి.

కరోనా వైరస్‌ను నిర్మూలించడానికి మాస్క్‌లు తప్పనిసరిగా వినియోగించాలంటూ, భౌతిక దూరం పాటించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం నిత్యం ప్రజలకు సూచిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రజలందిరికీ అందుబాటులో ఉంచేందుకు ఖమ్మం పట్టణంలో మున్సిపల్ అధికారులు కియోస్క్‌ను ప్రారంభించారు. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని జిల్లా కేంద్ర దవాఖాన, గాంధీ చౌక్‌లో ఏర్పాటుచేసిన కియోస్క్‌ను రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌తో కలిసి ప్రారంభించారు. మాస్క్‌లను వాడటం అలవాటుగా చేయాల్సిన అవసరం ఉన్నదని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ఈ విక్రయ కేంద్రంలో ఒక్కో మాస్క్‌ను కేవలం రూ.10కే అమ్ముతుండటం విశేషం.