గురువారం 25 ఫిబ్రవరి 2021
Telangana - Jan 25, 2021 , 18:08:06

ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఖమ్మం మార్కెట్‌

ఎర్ర బంగారంతో ఎరుపెక్కిన ఖమ్మం మార్కెట్‌

ఖమ్మం : ఒకేరోజ భారీగా మిర్చి బస్తాలు మార్కెట్‌ రావడంతో ఖమ్మం నగర వ్యవసాయ మార్కెట్‌ మిర్చియార్డు ఎర్రబంగారంతో ఎరుపెక్కిపోయింది. దీంతో మార్కెట్లో తేజా రకం మిర్చి సందడి నెలకొంది. నిన్నా మొన్నటి వరకు అరకొరగా పంట వచ్చింది. ఆదివారం సెలవుదినం కావడం, ఉష్ణోగ్రతలో మార్పు రావడం, పంట చేతికి వచ్చే సమయం కావడంతో ఒక్కసారిగా పంట తాకిడి పెరిగింది. దీంతో సొమవారం ఉదయం 8గంటల వరకే వేలాది బస్తాలతో మిర్చి యార్డు కిటకిటాలాడింది.

గడిచిన వారం రోజుల్లో రోజుకు 6 నుంచి 8వేల బస్తాలు మాత్రమే రాగా.. ఒక్కరోజు వ్యవధిలోనే అన్నదాతలు సుమారుగా 20 వేల బస్తాలు తీసుకువచ్చారు. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సీజన్‌ ఆరంభం నుంచి కొత్తపంటకు మంచి ధర వస్తుండటంతో జిల్లా రైతులతోపాటు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాద్‌, సూర్యాపేట, ఆంధ్రా ప్రాంతానికి చెందిన కృష్ణా జిల్లా రైతులు పంటను తీసుకొస్తున్నారు. ఉదయం జరిగిన జెండాపాటలో క్వింటాకు గరిష్ఠంగా ధర రూ 15,850 పలికింది. మధ్య ధర రూ.13వేలతో క్రయవిక్రయాలు జరిగాయి. 

ఇవి కూడా చదవండి..

నాటు వేసిన ఐఎఫ్‌ఎస్‌ అధికారి

ప్రేమజంట ఆత్మహత్య 

దాతృత్వంలోనూ దయన్నే..! 

సదాలక్ష్మి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి

ఇకపై 24 గంటలు తాగునీరు : మంత్రి జగదీష్‌రెడ్డి 

VIDEOS

logo