శనివారం 08 ఆగస్టు 2020
Telangana - Jul 28, 2020 , 13:58:41

శరవేగంగా ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పనులు

శరవేగంగా ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ పనులు

ఖమ్మం : ఖమ్మం సిగలో మరో మణిహారం ఆవిష్కృతం కాబోతున్నది. ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ కు అనుసంధానంగా మంత్రి రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో మినీ ట్యాంక్ బండ్ నిర్మితమవుతున్నది. ఎంతో విశిష్టత కలిగిన పాత లకారం పార్క్ ను కలుపుతూ మినీ లకారం ట్యాంక్ బండ్ తో ఆధునికరిస్తున్నారు. కాగా, వాకింగ్ ట్రాక్, మినీ గార్డెన్, బోటింగ్, ఫెన్సింగ్, చిన్నపిల్లకు ఆట స్థలం, గ్రీనరీ పనులను జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తో కలిసి మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలోనే ట్యాంక్ బండ్ ని ప్రజలకు అందుబాటులోకి తెస్తామని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీ నారాయణ, మేయర్ పాపాలాల్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, కార్పొరేటర్ లు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.logo