శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Aug 30, 2020 , 15:19:06

ద‌స‌రా నాటికి ఖ‌మ్మం ఐటీ హ‌బ్ ప్రారంభం

ద‌స‌రా నాటికి ఖ‌మ్మం ఐటీ హ‌బ్ ప్రారంభం

ఖ‌మ్మం: ఐటీ ప‌రిశ్ర‌మ‌ను రాష్ట్రంలో ద్వితీయ‌శ్రేణి ప‌ట్ట‌ణాల‌ను విస్త‌రించ‌డంలో భాగంగా ఖమ్మంలో చేప‌ట్టిన‌ ఐటీ హబ్ నిర్మాణం పూర్తయిందని మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ తెలిపారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఐటీ హబ్ నిర్మాణాన్ని పూర్తి చేశామ‌ని, దసరా నాటికి ప్రారంభిస్తామని, అక్టోబర్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తామ‌ని చెప్పారు. పూర్తిగా స్థానిక యువతకే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. 

సెప్టెంబర్ 30 నాటికి భ‌వ‌నాన్ని పూర్తిగా సిద్దంచేసి కంపెనీలకు అప్పగిస్తామన్నారు. ఆయా కంపెనీలతో ఇప్ప‌టికే మాట్లామ‌ని, వారు కూడా సిద్దంగా ఉన్నార‌ని తెలిపారు. ఇప్పటి వరకు 8 కంపెనీల‌తో ఎంఓయూ చేసుకున్నాయని, సుమారు 300 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని వెల్ల‌డించారు. 


logo