శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 19, 2020 , 02:35:08

భోపాల్‌ ఎన్‌ఐటీకి ఖమ్మం అంధ విద్యార్థి

భోపాల్‌ ఎన్‌ఐటీకి  ఖమ్మం అంధ విద్యార్థి

ముదిగొండ: ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన అంధ విద్యార్థి బానోత్‌ గణేశ్‌నాయక్‌కు మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌లోని మౌలానా ఆజాద్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)లోని ఎస్టీ, పీడబ్ల్యూడీలో సీటు వచ్చింది. గణేశ్‌కు 80 శాతం అంధ త్వం ఉంది. బోర్డు మీద రాతలేవీ కనిపించకున్నా తోటి విద్యార్థుల నోట్సు తీసుకుని రాసుకుని ప్రిపేర్‌ అయ్యేవాడు. తరచూ అధ్యాపకులతో ఫోన్‌లో మాట్లాడుతూ సందేహాలు నివృత్తి చేసుకుంటూ జేఈఈకి ప్రిపేర్‌ అయ్యాడని ప్రిన్సిపాల్‌ వాసిరెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు.