శుక్రవారం 30 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 16:38:48

రెయిన్ బో హాస్పిటల్ కు ఖమ్మం బాలిక తరలింపు

రెయిన్ బో హాస్పిటల్ కు ఖమ్మం బాలిక తరలింపు

హైద‌రాబాద్ : అత్యాచారానికి గురై ఆపై పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఖ‌మ్మం జిల్లాకు చెందిన బాలిక మెరుగైన వైద్యానికి రాష్ర్ట మ‌హిళా, శిశు సంక్షేమ‌శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ ఆదేశించారు. బాధిత బాలిక త‌ల్లిదండ్రుల విజ్ఞ‌ప్తి మేర‌కు అమ్మాయిని రెయిన్ బో ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించాల‌ని మంత్రి అధికారుల‌ను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి, కమిషనర్ దివ్య కేసును స్వ‌యంగా స్వ‌యంగా ప‌ర్య‌వేక్షిస్తున్నారు. బాలిక ఆరోగ్య పరిస్థితిని మంత్రి ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అదేవిధంగా జిల్లా పోలీసు, వైద్య అధికారులతోనూ మాట్లాడి వెంటనే ఈ కేసుకు సంబంధించిన ద‌ర్యాప్తును వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. 

తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, శిశువుల సంక్షేమం, భద్రతకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుంద‌న్నారు. ముఖ్యంగా మహిళలపై దాడులు జరిగితే నిందితులు ఎంతటివారైనా వదిలే ప్ర‌సక్తే లేద‌న్నారు. అమ్మాయిపై దాడికి పాల్పడిన వారికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు.