శనివారం 06 జూన్ 2020
Telangana - May 16, 2020 , 20:59:16

ఉపాధి పనుల్లో ఖమ్మం జిల్లా మూడవ స్థానం : మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్

ఉపాధి పనుల్లో ఖమ్మం జిల్లా మూడవ స్థానం : మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్

సత్తుపల్లి : ఉపాధి పనుల్లో, కూలీల పనిదినాల్లో రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఖమ్మం జిల్లా మూడవ స్థానంలో ఉందని రాష్ట్ర రవాణా శాఖామంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో యాతాలకుంట, బుగ్గపాడు, రేగళ్లపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో ఉపాధి కూలీలు, నల్గొండ జిల్లా బత్తాయి రైతులను ఆదుకునేందుకు నియోజకవర్గంలోని 35వేల మంది ఉపాధి కూలీలకు యువనేత కేటీఆర్‌ పిలుపు మేరకు బత్తాయిలు, మజ్జిగ ప్యాకెట్లు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, మాస్క్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 1.35లక్షల మంది ఉపాధిహామీ కూలీలు పనిచేస్తుండగా సత్తుపల్లి నియోజకవర్గంలో 35 వేల మంది కూలీలు పనులు చేస్తున్నారని... ఎక్కువ పనిదినాల నమోదులోనూ జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. అధికారులు ఉపాధికూలీలకు పనులు చూపిస్తూ కూలీల సంఖ్యను పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. 


logo