శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Telangana - Jan 24, 2021 , 20:47:26

హైదరాబాద్‌కు దీటుగా ఖమ్మం అభివృద్ధి

హైదరాబాద్‌కు దీటుగా ఖమ్మం అభివృద్ధి

ఖమ్మం : ఖమ్మం నగరాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేస్తానని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. ఖమ్మం కార్పొరేషన్‌లోని 26వ డివిజన్‌ బైపాస్‌రోడ్‌లో రూ.2 కోట్లతో నిర్మించనున్న రహదారి పనులకు మేయర్‌ డాక్టర్‌ జి.పాపాలాల్‌తో కలిసి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన వాగ్దానాల అమలులో భాగంగా నగరంలో జంక్షన్లు, ఫౌంటేన్లు ఏర్పాటు చేశామన్నారు.

అన్ని డివిజన్లలోనూ రహదారులు, డ్రెయిన్లు, డివైడర్లు నిర్మిస్తున్నామని, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఖాళీ స్థలాల్లో పార్కులు, వాక్‌వేలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, డీసీసీబీ చైర్మన్‌ కురాకుల నాగభూషణం తదితరులు ఉన్నారు.

ఇవి కూడా చదవండి..

కూల్‌డ్రింక్‌ అని తాగితే.. ప్రాణాలమీదకొచ్చింది

పద్య ప్రక్రియను ‌ఇష్టపడే నాయకుడు సీఎం కేసీఆర్

యాదాద్రిలో శాస్ర్తోక్తంగా లక్ష పుష్పార్చన

క‌రోనా దెబ్బ‌.. మరో 12 కోట్ల మంది పేద‌రికంలోకి.. 

రైతు వేదికలతో సాగు సమస్యలకు పరిష్కారం 

కరెంట్‌ షాక్‌తో రైతు మృతి VIDEOS

logo