బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 10, 2021 , 21:29:24

ఖమ్మం డీసీసీబీ అగ్రగామిగా నిలవాలి

ఖమ్మం డీసీసీబీ అగ్రగామిగా నిలవాలి

ఖమ్మం : రాష్ట్రంలో సహకార సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని, దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు సాగుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఖమ్మం నగరంలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌ (డీసీసీబీ) ఆవరణలో నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 1904లో సహకార రంగానికి పునాదులు పడ్డాయన్నారు. డీసీసీబీల మనుగడ కేవలం సహకార సంఘాలపైనే ఆధారపడి ఉందన్నారు. 

కొనుగోలు కేంద్రాల ద్వారా సొసైటీలు బలోపేతం అవుతాయని అన్నారు. సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టడంతో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. డీసీసీబీ బ్యాంకు ఉద్యోగులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఖమ్మం డీసీసీబీ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉందని, మున్ముందు కరీంనగర్‌కు పోటీగా నిలవాలని పిలుపునిచ్చారు.

ముఖ్యంగా సొసైటీ చైర్మన్లు మరింత కష్టపడి పనిచేసి బ్యాంకు పురోభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర కోఆపరేటివ్‌ అపెక్స్‌ బ్యాంక్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, ఖమ్మం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, డీసీసీబీ చైర్మన్‌ కూరాకుల నాగభూషణం, పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, హరిప్రియ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఖమ్మం జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, రాష్ట్ర మార్క్‌ఫెడ్‌ వైస్‌ చైర్మన్‌ బొర్రా రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి

ప్రపంచ పసుపు ఉత్పత్తిలో ఆ జిల్లాదే 8 శాతం

భయపడొద్దు..బాగవుతుంది 

భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల

సాగునీటి సమస్యలకు చెక్‌పెడుతాం : ఎమ్మెల్సీ కవిత 


logo