ఎమ్మెల్సీ కవితను కలిసిన కేశ్‌పల్లి గ్రామస్తులు.. సమస్యలపై వినతి

హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా జక్రాన్‌పల్లి మండలం కేశ్‌పల్లి గ్రామస్తులు శుక్రవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా గ్రామానికి సబ్‌స్టేషన్ మంజూరు చేయించాలని వినతిపత్రం అందజేశారు. గ్రామంలో పెద్దమ్మతల్లి ఆలయం, శ్రీ జగదాంబదేవి, సేవాలాల్ మహరాజ్ మందిరాలను దేవాదాయశాఖ మంజూరు చేసిందని, కానీ పనులు ప్రారంభం కాలేదని ఆమె దృష్టికి తెచ్చారు. ప్రముఖ దేవాలయం శ్రీశివకృశవనాథ స్వామి మందిరాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేయాలని, సమీపంలోని చెరువును మినీట్యాంక్ బండ్‌గా తీర్చిదిద్దాలని విన్నవించారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషిచేస్తానని ఎమ్మెల్సీ కవిత వారికి హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ కవితను కలిసిన వారిలో సర్పంచ్ మహేశ్, ఎంపీటీసీ మున్నూరు గంగాధర్, పలువురు గ్రామస్తులున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- హిందుస్థాన్ పెట్రోలియంలో ఇంజినీర్ పోస్టులు
- మహిళా దినోత్సవం : మగువలకు టెక్ దిగ్గజం బాసట!
- ఆరోగ్య కారణాలంటూ అభ్యర్థినిని తప్పించిన టీఎంసీ
- చట్ట వ్యతిరేక చర్యలను ప్రభుత్వం సహించదు : మంత్రి కేటీఆర్
- మెగా హీరో షేర్ చేసిన క్యూట్ పిక్.. నెట్టింట చక్కర్లు
- హెలికాప్టర్ ప్రమాదంలో బిలియనీర్ ఒలివర్ డసాల్ట్ మృతి
- నా హామీలను డీఎంకే కాపీ కొడుతోంది: కమల్‌హాసన్
- షాహిద్ అఫ్రిది కూతురిని పెళ్లి చేసుకోనున్న పాక్ పేసర్!
- పుష్పరాజ్ పాడుపని : బాలికలకు పోర్న్ వీడియోలు చూపుతూ..!
- తనతో పని చేసిన మహిళలకు సెల్యూట్ చేసిన శేఖర్ కమ్ముల