సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 13, 2020 , 20:05:27

కేకే, సురేశ్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

కేకే, సురేశ్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థులుగా కే. కేశవరావు, కేఆర్‌ సురేశ్‌రెడ్డి నేడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇరువురు తమ నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. సురేశ్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. కేకే నామినేషన్‌ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు పాల్గొన్నారు. అంతకుక్రితం గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం దగ్గర రాజ్యసభ అభ్యర్థులు కేకే, సురేష్‌రెడ్డి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ సంతోష్‌కుమార్‌, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. 


logo