శనివారం 11 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 13:52:07

కర్నల్ సంతోష్ బాబు జ్ఞాపక చిహ్నంగా కేసారం

కర్నల్  సంతోష్ బాబు జ్ఞాపక చిహ్నంగా కేసారం

సూర్యాపేట : కర్నల్ సంతోష్ బాబుకు మంత్రి జగదీష్ రెడ్డి అశ్రునయనాలతో కడసారి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కల్నల్ సంతోష్ బాబు జ్ఞాపక చిహ్నంగా కేసారాన్ని మారుస్తామన్నారు. అలాగే సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రధాన కూడలికి సంతోష్ బాబు పేరు పెడుతామన్నారు. కర్నల్ కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామన్నారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే వారి కుటుంబ సభ్యులకు సందేశం పంపారు. వారి పిల్లల చదువులు, కుటుంబ సభ్యులకు ప్రభుత్వం బాసటగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా, మంత్రి జగదీశ్‌రెడ్డి సీఎం కేసీఆర్ సూచనల మేరకు హైదరాబాద్ నుంచి కర్నల్ భౌతికకాయం తరలింపు మొదులుకొని అంత్యక్రియలు పూర్తయ్యే వరకు దగ్గరుండి పక్కాగా నిర్వహించారు.


logo