ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 15, 2020 , 17:57:43

శ‌బ‌రిమ‌ల ద‌ర్శ‌నం.. తెలంగాణ సీఎస్‌కు కేరళ సీఎస్ లేఖ

శ‌బ‌రిమ‌ల ద‌ర్శ‌నం.. తెలంగాణ సీఎస్‌కు కేరళ సీఎస్ లేఖ

హైద‌రాబాద్ : రాష్ర్టంలోని అయ్య‌ప్ప భ‌క్తుల స‌మాచారం నిమిత్తం శ‌బ‌రిమ‌లలో అయ్య‌ప్ప‌స్వామి ద‌ర్శ‌నానికి సంబంధించిన వివ‌రాల‌ను తెలుపుతూ కేర‌ళ రాష్ర్ట ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి తెలంగాణ సీఎస్‌కు లేఖ రాశారు. కొవిడ్ నేప‌థ్యంలో ఈసారి శబరిమల ఆలయంలో నెయ్యి అభిషేకం, పంపానదిలో స్నానాలకు అనుమతి లేదని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. వర్చువల్‌ క్యూపోర్టల్‌ ద్వారా దర్శనం కోసం భక్తుల నమోదు తప్పనిసరి పేర్కొంది. భ‌క్తులు https://sabarimalaonline.org ద్వారా  నమోదు చేసుకునే అవకాశం ఉన్న‌ట్లు తెలిపింది. ప్రారంభంలో రోజుకు వెయ్యి మంది, వారాంతంలో రోజుకు 2 వేల మంది భక్తులకు మాత్రమే అనుమతి ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. దర్శనానికి 48 గంటల ముందు కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి అని పేర్కొన్నారు. పదేళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లకు  పైబడిన వృద్ధుల‌కు దర్శనానికి అనుమతి లేదని కేరళ ప్రభుత్వం తెలిపింది.


logo