మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 13:28:31

గిన్నిస్‌ రికార్డుకు కీసర‌ తహసీల్దార్‌ పేరు ప్రతిపాదన.. పరిశీలిస్తామన్న సంస్థ!

గిన్నిస్‌ రికార్డుకు కీసర‌ తహసీల్దార్‌ పేరు ప్రతిపాదన.. పరిశీలిస్తామన్న సంస్థ!

హైదరాబాద్‌ : భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధకశాఖకు పట్టుబడిన కీసర తహసీల్దార్‌ నాగరాజు రికార్డే సృష్టించారు. ఆయన పేరును గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రిక్డార్స్‌లో పేరు చేర్చాలంటూ అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పలు సంస్థలు సంస్థను కోరాయి. ఈ మేరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. విలువైన 15 ఎకరాల భూమిని పట్టా చేసేందుకు రూ.2 కోట్లకు ఒప్పందం చేసుకొని రూ.1.10 కోట్లు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంత పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడిన సంఘటన ప్రపంచంలోనే ఇదే తొలిసారి అయి ఉంటుందని యూత్‌ ఫర్‌ యాంటీ కరప్షన్‌ అధ్యక్షుడు రాజేందర్‌, వరంగల్‌ కేంద్రంగా పని చేస్తున్న జ్వాల సంస్థ ప్రతినిధి ప్రశాంత్‌ గిన్నిస్‌ బుక్‌ రికార్డు కోసం ఇటీవల ఆన్‌లైన్‌ దరఖాస్తు చేశారు. అయితే ప్రస్తుతానికి ప్రభుత్వ ఉద్యోగుల అవినీతికి సంబంధించి రికార్డులు నమోదు చేసే విభాగం తమ వద్ద లేదని, త్వరలోనే ప్రత్యేకంగా కేటగిరిని ప్రారంభించే విషయాన్ని పరిశీలిస్తామని గిన్నిస్‌ బుక్‌ సంస్థ తెలిపిందని ఆయా సంస్థల ప్రతినిధులు రాజేందర్‌, ప్రశాంత్‌ పేర్కొన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo