Telangana
- Jan 08, 2021 , 02:01:58
కేసీఆర్ ఆరోగ్యం భేష్

- సికింద్రాబాద్ యశోద దవాఖానలో వైద్య పరీక్షలు
హైదరాబాద్, జనవరి 7 (నమస్తే తెలంగాణ): ఊపిరితిత్తుల్లో కాస్త మంటగా ఉండటంతో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు గురువారం సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానలో డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించారు. సీఎం వ్యక్తిగత వైద్యనిపుణుడు డాక్టర్ ఎంవీ రావుతోపాటు శ్వాసకోశ నిపుణుడు డాక్టర్ నవనీత్‌సాగర్‌రెడ్డి, హృద్రోగ నిపుణుడు డాక్టర్ ప్రమోద్‌కుమార్ పరీక్షించారు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్, అల్ట్రా సౌండ్‌తోపాటు అన్ని రకాల రక్త పరీక్షలు నిర్వహించారు. అనంతరం దగ్గుతోపాటు స్వల్ప ఇన్ఫెక్షన్ మినహా సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగున్నదని వ్యక్తిగత వైద్యనిపుణుడు డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. స్వల్ప ఇన్ఫెక్షన్కు యాంటీబయాటిక్స్ కొద్దిరోజులు వాడాలని చెప్పినట్టు పేర్కొన్నారు. వైద్య పరీక్షల అనంతరం సీఎం కేసీఆర్ తిరిగి ప్రగతిభవన్‌కు చేరుకున్నారు.
తాజావార్తలు
MOST READ
TRENDING