గురువారం 09 జూలై 2020
Telangana - Jun 02, 2020 , 19:26:42

దేశానికి తొవ్వ జూపే దక్షత ఉన్న నేత కేసీఆర్‌

దేశానికి తొవ్వ జూపే దక్షత ఉన్న నేత కేసీఆర్‌

దేవరకద్ర: మూసాపేట మండలం జానంపేటలో డబల్‌ బెడ్రూం ఇండ్లు, పాఠశాల అదనపు గదులకు రాష్ట్ర మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌లు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ దేశంలో తెలంగాణ నంబర్‌ వన్‌ అన్నారు. ఆరేళ్ల తెలంగాణ దేశంలోని 70 ఏండ్ల రాష్ర్టాలతో పోటీ పడుతుందని, ఆ రాష్ర్టాలన్నింటిని అధిగమించి దేశంలో తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. అలాగే దేశంలో నంబర్‌ వన్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దేశంలో అత్యధిక ధాన్యం పండించిన రాష్ట్రంగా తెలంగాణ నంబర్‌ వన్‌గా నిలిచిందన్నారు. వ్యవసాయానికి 24 గంటలు కరంటు ఇచ్చిన రాష్ట్రంగా, సాగునీటికి అత్యధిక బడ్జెట్‌ కేటాయించి ప్రాజెక్టులు కడుతున్న రాష్ర్టాలలో, మూడేళ్లలో ప్రపంచంలోనే పెద్దదయిన కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకుని నీళ్లు తెచ్చుకున్న రాష్ట్రంగా తెలంగాణ నంబర్‌ వన్‌గా అన్నారు. 

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ పదవుల కోసం ప్రాజెక్టులను అడ్డుకున్నోళ్లు ఈరోజు దీక్షలు చేయడం విడ్డూరం అన్నారు. చెరువుల పూడిక తీయనోళ్లు రిజర్వాయర్ల కాడ దీక్షలు చేస్తున్నరని, సీమాంధ్రకు పోయిన తెలంగాణ నీళ్లకు హారతులు పట్టినోళ్లు, పోతిరెడ్డిపాడుకు అనుకూలంగా వ్యాసాలు రాసినోళ్లు ఈ రోజు పోతిరెడ్డిపాడు గురించి నీతులు చెబుతున్నారన్నారు. కండ్లుమండి కాంగ్రెస్‌ నేతలు దీక్షలు చేస్తున్నారని, ఆంధ్రోళ్ల మోచేతి నీళ్లుతాగి సద్దులు కట్టినోళ్ల మాటలు వినేందుకు తెలంగాణ ప్రజలు సిద్దంగా లేరన్నారు.


logo