బుధవారం 03 జూన్ 2020
Telangana - May 12, 2020 , 02:13:56

రైతుపక్షపాతి సీఎం కేసీఆర్‌

రైతుపక్షపాతి సీఎం కేసీఆర్‌

మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

నిర్మల్‌, నమస్తే తెలంగాణ: సీఎం కేసీఆర్‌ రైతాంగ సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశంలోనే తెలంగాణను అగ్రస్థానంలో నిలిపారని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. రూ. 25 వేలలోపు పంట రుణాల మాఫీతోపాటు రైతుబంధు పథకానికి నిధులు మంజూరు చేసినందుకు సోమవారం నిర్మల్‌లోని దివ్యాగార్డెన్‌లో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మె ల్యే రేఖానాయక్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ విజయలక్ష్మి, రైతులు, రైతు నాయకులు, ప్రజాప్రతినిధులు సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి అల్లోల మాట్లాడుతూ.. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఇబ్బందులు ఉన్నప్పటికీ.. రైతు రుణమాఫీ, రైతుబంధు కోసం నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి అని కొనియాడారు. 

సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాల వెల్లువ

గోదావరిఖని/చెన్నూర్‌/మంచిర్యాల టౌన్‌: పంట రుణ మాఫీ, రైతుబంధుకు నిధుల కేటాయింపు, 10 లక్షల ఎకరాల వరకు ఆయిల్‌ పామ్‌ పంటల సాగుకు అనుకూలం వంటి నిర్ణయాలు తీసుకోవడంతో ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు సంబురాలు జరుపుకొంటున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి నగర మేయర్‌ బంగి అనిల్‌కుమార్‌తో కలిసి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రం లో 5 లక్షల నుంచి 10 లక్షల ఎకరాల వరకు ఆయిల్‌ పామ్‌ పంటలను సాగు చేసేందుకు సర్కారు నిర్ణయం తీసుకోవడంపై మంచిర్యాల జిల్లా మందమర్రిలో ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, మంచిర్యాలలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు సీఎం కేసీఆర్‌ చిత్రపటాలకు పాలతో అభిషేకం చేశారు.logo