ఆదివారం 09 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 02:57:04

వేగంగా ప్రాజెక్టుల పనులు

వేగంగా ప్రాజెక్టుల పనులు

  • వెంటనే నిధుల సమీకరణ ప్రక్రియ
  • త్వరితగతిన కాళేశ్వరం 3వ టీఎంసీ,పాలమూరు-రంగారెడ్డి, సీతారామ,సమ్మక్క బరాజ్‌ పనులు పూర్తిచేయాలి
  • వర్షాకాలం పూర్తికాగానే వేగం పెంచాలి
  • అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: నిధుల సమీకరణ ప్రక్రియను వెంటనే పూర్తిచేసి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మూడో టీఎంసీ నీటిని తరలించే పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అదేశించారు. దీనితోపాటు.. పాలమూరు- రంగారెడ్డి, సీతారామ ప్రాజెక్టు, సమ్మక్క బరాజ్‌ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని చెప్పారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు- నిధుల సమీకరణ అంశంపై సీఎం కేసీఆర్‌ మంగళవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘నీటి లభ్యత కలిగిన సమయంలో ప్రతిరోజూ గోదావరి నుంచి 4 టీఎంసీలు, కృష్ణా నుంచి 3 టీఎంసీల నీటిని తరలించి, రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి ప్రాజెక్టులను నిర్మిస్తున్నాం. బడ్జెట్‌ నిధులతోపాటు వివిధసంస్థల నుంచి నిధులు సమీకరిస్తున్నాం. ఇప్పటికే దాదాపు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి వివిధ సంస్థలతో ఆర్థిక సహాయం విషయంలో ఒప్పందాలు పూర్తయ్యాయి. ప్రభుత్వం తరఫున కట్టాల్సిన వాటాను చెల్లించి, వెంటనే నిధుల సమీకరణ ప్రాసెస్‌ పూర్తిచేయాలి. వర్షాకాలం పూర్తికాగానే అన్ని ప్రాజెక్టుల పనులు వేగవంతం కావాలి’ అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు స్పష్టంగా చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌కుమార్‌, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యదర్శి స్మితాసబర్వాల్‌, ఈఎన్సీ మురళీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు.logo