మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 11:57:56

శోభానాయుడు మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

శోభానాయుడు మృతి ప‌ట్ల సీఎం కేసీఆర్ సంతాపం

హైద‌రాబాద్‌: ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, పద్మశ్రీ డా.శోభా నాయుడు ఇవాళ‌ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆమె మృతి ప‌ట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు.  కూచిపూడి క‌ళానృత్యంలో శోభానాయుడు అసాధార‌ణ క‌ళాకారిణి అని, స‌త్య‌భామ‌, ప‌ద్మావ‌తి లాంటి పాత్ర‌ల‌ను త‌న డ్యాన్స్ రూపంలో ఆమె అల‌రించిన‌ట్లు సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. మెదడు సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతున్న ఆమె ఓ ప్రైవేటు హాస్పిట‌ల్‌లో తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజుల నుండి ఆమె వెంటిలేటర్‌పై ఉంచుతూ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డా.శోభానాయుడు శిక్షణ ఇచ్చిన శిష్యులు(రాలు) వేలసంఖ్యలో ఉన్నారు. ఆమె భర్త, మాజీ IAS అధికారి సీ.అర్జునరావుకు సంతాప సందేశాలు పంపిస్తున్నారు. వెంపటి చినసత్యం శిష్యురాలిగా శొభానాయుడు కూచిపూడి అకాడమీని స్థాపించి గత 40ఏళ్లుగా కూచిపూడి తరగతుల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. ఆమె ఎన్నో అవార్డులను అందుకున్నారు. 


logo