ఇల్లందకుంట/ఇల్లంద కుంట రూరల్: సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక మంచి పనులు చేత్తండు. గతంలో మా గురించి పట్టించుకున్న వారే లేరు. సీఎం దళితుల బాగు కోసమే నిరంతరం ఆలోచిస్తున్నడు. గిప్పుడు మా కోసం దళితబంధు పథకం పెట్టడం మా అదృష్టం. మాకు ఒక బిడ్డ ఉంది. ఆమె పెళ్లి ఎట్ల చేయాలనే రందీ ఉంది.
గిప్పుడు కొంచెం సంతోషంగా ఉంది. దళితబంధు డబ్బులతో కిరాణ దుకాణం పెట్టుకొని బతుకుతం. మా కుటుంబానికి భరోసా దొరికింది. ఇదంతా కేసీఆర్ వల్లే సాధ్యమవుతున్నది. పేదలు బాగుపడుతరు. కొత్తూరి లచ్చమ్మ, ఇల్లందకుంట
ఇప్పటి వరకు ఎవ్వలేంజేయలే…
ఇప్పటి వరకు మాకు ఎవ్వలేంజేయలే. దళిత బంధు పథకంతోటి బాగు పడాలని సార్ జేత్తండు. దీంతోటి మా కుటింబం బాగుపడ్తది. మమ్మల్ని ఆదుకు న్నోళ్లకు మేం సాయపడ్తం. ఈటల రాజేందర్ ఏం ఇయ్యలే. మాకేంజెయ్యలే. దళిత బంధుతోటి యాపారాలు జేసుకుంటం. బాగుపడి మీకు జూపెడ్తం. అందరికైతే ఇయ్యాలే. – నందిపట్ల ప్రమీల, జగ్గయ్యపల్లి (జమ్మికుంట )