బిగ్ బాస్ సీజన్ 4 టైటిల్ విన్నర్, సినీ నటుడు అభిజిత్ కూడా బిగ్ బాస్ షోతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. మొదట్లో అభిజిత్ చాలా సైలెంట్‌గా ఉంటూ చివరిలో రెచ్చిపోయాడు. పులిహోర కలపడం దగ్గర నుండి ఫైట్ చేయడం వరకు ఎక్కడా తగ్గలేదు.గతంలో జరిగిన యాక్సిడెంట్ వలన భుజానికి గాయం కావడంతో టాస్క్‌లలో పెద్దగా ప్రతిభ కనబరచలేదు. అయినప్పటికీ అభిజీత్‌కి టైటిల్ కట్టబెట్టారు ఆడియన్స్.
బిగ్ బాస్ షో తర్వాత అందరు మంచి జోరు మీదుంటే అభిజిత్ మాత్రం సైలెంట్ అయ్యాడు. ఎక్కడ కనిపించడం లేదు. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తూ నెటిజన్స్‌కి టచ్‌లో ఉన్నాడు. అయితే ఈ సారి అభిమానుల కోసం సోషల్ మీడియాలోకి వచ్చిన అభిజీత్ తన భుజంకు గాయం అయిందని హాస్పిటల్ కి వెళ్ళాను త్వరగా తిరిగి వస్తానని ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ఇటీవల మంచి ఫిజిక్ కోసం భారీగా వర్కవుట్స్ చేయగా, అవి ఆయనను ప్రమాదంలో నెట్టిందట. ఈ విషయం తెలిసిన అభిమానులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.