గురువారం 09 జూలై 2020
Telangana - Jun 26, 2020 , 13:20:19

ఏ సీఎం చేయని గొప్ప పనులు కేసీఆర్‌ చేస్తున్నారు : స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

ఏ సీఎం చేయని గొప్ప పనులు కేసీఆర్‌ చేస్తున్నారు : స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి

రాజన్న సిరిసిల్ల : దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని గొప్ప పనులు రాష్ట్ర సీఎం కేసీఆర్‌ చేస్తున్నారని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్‌తో కలిసి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డితో నేడు ప్రారంభించారు. ఆవునూరు-వెంకటాపూర్‌ దగ్గర మానేరు వాగులో హరితహారంలో భాగంగా స్పీకర్‌ మొక్కలు నాటారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.

హరితహారం చాలా గొప్ప కార్యక్రమం. హరితహారం కార్యక్రమం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మానవ మనుగడకు చెట్లు అతి ముఖ్యమైనవి తెలిపారు. ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ ఇంటి ముందు మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. సీఎం కేసీఆర్‌ కల్యాణలక్ష్మి లాంటి ఎన్నో గొప్ప పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రైతుబంధు ప్రపంచంలోనే అద్భుత పథకంగా గుర్తింపు పొందిందని స్పీకర్‌ పేర్కొన్నారు.


logo