బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 11, 2021 , 02:19:10

త్వరలో 50వేల ఉద్యోగాల భర్తీ

త్వరలో 50వేల ఉద్యోగాల భర్తీ

  • రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి

నెక్కొండ/ఖానాపురం/దుగ్గొండి, జనవరి 10: నీళ్లు, నిధులు, నియామకాల్లో సీఎం కేసీఆర్‌ దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండ, ఖానాపురం, దుగ్గొండి మండలంలోని గిర్నిబావిలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ఐటీ రంగంలో రెండు లక్షలకుపైగా కొత్త ఉద్యోగాలను సృష్టించుకున్నామన్నారు. ప్రభుత్వం తరఫున ఇప్పటికే లక్షకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. వచ్చే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో భర్తీకానున్న ఉద్యోగాల కోసం గ్రామీణ యువత పోటీపడి అద్భుతమైన ఫలితాలను సాధించేందుకు వీలుగా నర్సంపేటలో ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వరంగల్‌ రూరల్‌ జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, గ్రాడ్యుయేట్స్‌ ఎన్నికల ఇంచార్జి , ఎన్నారై శానబోయిన రాజుకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


logo