బుధవారం 15 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 01:19:20

రైతుల ఆర్థికాభివృద్ధే కేసీఆర్‌ ధ్యేయం

రైతుల ఆర్థికాభివృద్ధే  కేసీఆర్‌ ధ్యేయం

  • మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి

నిజామాబాద్‌ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: రైతులను ఆర్థికంగా పరిపుష్టి చేయాలన్న ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతాల్లో సంపద సృష్టిం చేందుకు వినూత్న ఆలోచనలతో సీఎం కేసీఆర్‌ ముందుకుపోతున్నారని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. పేదలు, రైతుల అభ్యున్నతే ధ్యేయంగా సీఎం పనిచేస్తున్నారని తెలిపారు.  ఈ నెల 16న జరిగిన కలెక్టర్ల సదస్సులో సీఎం కేసీఆర్‌ ఆదేశించిన పలు అంశాలపై శుక్రవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో కలెక్టర్‌ నారాయణరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ విఠల్‌ రావులతో కలిసి సుదీర్ఘంగా సమీక్షించారు. సాయంత్రం కామారెడ్డి కలెక్టరేట్‌లోనూ కలెక్టర్‌ శరత్‌, ఇతర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడు తూ.. ఉపాధి హామీ పనులను ప్రధాన శాఖ ల్లో అనుసంధానం చేస్తే ఇంకా పని దినాలు పెంచుకోవచ్చని, తద్వార పేదలకు ఎక్కువ పని రోజులు లభించే అవకాశం ఉంటుందని చెప్పారు. నీటిపారుదల శాఖలో కూలీలతో చేసే పనులకు ఉపాధి హామీ పథకాన్ని వాడుకోవాలని మంత్రి వేముల చెప్పారు. ఉపాధిహామీ పథకంలో కూలీలుగా పని చేసేందుకు ఆసక్తి ఉన్నవారు ఎంపీడీవోలకు దరఖాస్తు చేయాలని సూచించారు. హరితహారం మొ క్కల సంరక్షణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 


logo