మంగళవారం 07 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 01:22:21

పోడు సమస్యలు పరిష్కరిస్తం

పోడు సమస్యలు పరిష్కరిస్తం

  • రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

కారేపల్లి రూరల్‌: పోడు భూముల సమస్యలకు సీఎం కేసీఆర్‌ పరిష్కారం చూపుతారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం ఖమ్మం జిల్లా కారేపల్లి, ఏన్కూరు మండలాల్లో మంత్రి పర్యటించారు. మొదట కారేపల్లి మండలం మాధారంలో రూ.కోటి డీఎంఎఫ్‌ నిధులతో చేపట్టనున్న సీసీరోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్‌తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. అటవీ హక్కు పత్రాలు పొందిన రైతులను ఫారెస్టు అధికారులు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పెట్టొద్దని సూచించారు. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని, జిల్లాలో ప్రతి ఎకరాకు సాగు నీరు ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని వివరించారు.


logo