బుధవారం 21 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 20:49:47

కేబీఆర్ పార్కు వాకర్స్ వార్షిక పాసుల గ‌డువు పొడిగింపు

కేబీఆర్ పార్కు వాకర్స్ వార్షిక పాసుల గ‌డువు పొడిగింపు

హైద‌రాబాద్ : కేబీఆర్ పార్కు వాకర్స్ వార్షిక పాసుల రిన్యూవ‌ల్ గ‌డువు తేదిని పొడిగించిన‌ట్లు రాష్ర్ట‌ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణశాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. గత జూన్ నెల‌తో పాసుల గ‌డువు ముగిసిన‌ప్ప‌టికీ క‌రోనా నేప‌థ్యంలో డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు వార్షిక పాసుల గడువు పెంచినట్లు మంత్రి వెల్ల‌డించారు. కోవిడ్ ప్ర‌త్యేక ప‌రిస్థితుల‌ వ‌ల్ల ఏప్రిల్, మే, జూన్ నెల‌ల్లో కేబీఆర్ పార్కును మూసివేసిన నేప‌థ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌న్నారు. జ‌న‌వ‌రి-2021 లో కొత్త పాసుల‌ను తీసుకోవాల్సి ఉంటుంద‌ని చెప్పారు. ఈ నిర్ణ‌యంపై కేబీఆర్  పార్కు వాక‌ర్స్ అసోసియేష‌న్ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.


logo