శనివారం 06 మార్చి 2021
Telangana - Oct 12, 2020 , 21:31:45

ఎమ్మెల్సీగా కవిత గెలుపు.. నిజామాబాద్‌ అభివృద్ధికి మలుపు : శ్యామ్‌బాబు

ఎమ్మెల్సీగా కవిత గెలుపు.. నిజామాబాద్‌ అభివృద్ధికి మలుపు : శ్యామ్‌బాబు

హైదరాబాద్‌ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత విజయం నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అభివృద్ధికి కీలక మలుపు అని యూరోప్ తెలంగాణ అసోసియేషన్ వ్యవస్థాపకుడు శ్యామ్‌బాబు ఆకుల అభివర్ణించారు. ఉపఎన్నికలో భారీ మెజారిటీతో విజయం సాధించిన కల్వకుంట్ల కవితకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికలు ఏవైనా తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే విజయమని పేర్కొన్నారు. ఎంపీగా  గతంలో నిజామాబాద్‌ను కవిత ఎంతగానో అభివృద్ధి చేశారన్నారు. ప్రజాదరణ, పరిణతి కలిగిన మహిళా నేతల్లో కవిత ముందుంటారని అన్నారు. ఆమె రాజకీయాల్లో మరింత ఎత్తుకు ఎదిగి ఉన్నత పదవులు అధిరోహించాలని శ్యామ్‌బాబు ఆకాంక్షించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo